20న వంద కిలోమీటర్ల సైకిల్‌ర్యాలీ

Sat,October 19, 2019 02:03 AM

కరీంనగర్ స్పోర్ట్స్: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో పర్యావరణానికి ముప్పుగా మారుతున్నదనీ, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కెప్టెన్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో కళాశాలలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్, కరీంనగర్ ర్యాండోనియర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20న తెలంగాణ చౌక్ నుంచి పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ వరకు, అక్కడి నుంచి తిరిగి తెలంగాణ చౌక్‌కు 100 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతుండటంతో వాటినుంచి వెలువడే విషవాయువులు గాలిలో కలిసి ప్రాణకోటికి ముప్పుగా పరిభ్రమిస్తున్నాయన్నారు.

సైకిల్ వినియోగంతో శారీరక, మానసిక ధృడత్వం పెరగడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. ర్యాలీని విజయవంతంగా పూర్తిచేసిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా సన్మానిస్తామని పేర్క్నొరు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు రమేశ్, వీ జగదీశ్వరాచారి, అరవింద్, సురభి వేణుగోపాల్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. సైక్లింగ్‌లో పాల్గొనాలనుకునే వారు 9676673636 సెల్ నెంబర్‌లో సంప్రదించాలని వారు సూచించారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles