మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

Sat,October 19, 2019 02:02 AM

జమ్మికుంట: సమీకృత మత్య్స అభివృద్ధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నదనీ, మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వ ముందుకు సాగుతున్నదనీ రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ అన్నారు. శుక్రవారం జిల్లా మత్య్సశాఖ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని నాయిని, గుండ్ల చెరువుల్లో చేపల పెంపకానికి 2లక్షల 52వేల చేప పిల్లలను అందించింది. వాటిని రాజేశ్వర్‌రావు, కనుమల్ల విజయ, ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌లు నాయిని చెరువులో లక్షా 47వేలు, గుండ్ల చెరువులో లక్షా 5వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేసిన సందర్భాలు లేవని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తున్నదని కొనియాడారు. మత్య్సకారుల అభి వృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నదనీ, సబ్సిడీలతో ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నిండాయనీ, ఈ యేడు కూడా చేప పిల్లలను ఉచితంగా అందిస్తున్నదని వివరించారు. ఇక్కడ మాజీ కౌన్సిలర్ బోళ్ల సుధాకర్, టీఆర్‌ఎస్ అర్బన్‌శాఖ అధ్యక్షుడు రాజ్‌కుమార్, భీమన్న, మల్లయ్య, తదితరులున్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles