మెడికవర్‌లో అరుదైన ఆపరేషన్

Fri,October 18, 2019 01:32 AM

కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ మెడికవర్ దవాఖాన లో అరుదైన ఆపరేషన్ జరిగింది.. రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన 8 ఏళ్ల బాలుడి తలకు పూ ర్వస్థితి తీసుకువచ్చినట్లు వైద్యశాల న్యూరో సర్జన్ డాక్టర్ పీవీకే కిశోర్ తెలిపారు. గురువారం ద వా ఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా నమిలికొండకు చెందిన మల్యాల పర్శరాం కుమారుడు రిషికుమార్ ఈనెల 5న రోడ్డు ప్రమాదంలో తీ వ్రంగా గాయపడ్డాడు. అదే రోజు బాలు డిని మె డికవర్ హాస్పిటల్‌కు తీసుకురాగా స్కానిం గ్ చేసి ప్రమాదస్థితి, బాలుడి కండీషన్‌ను పరీక్షించారు. అప్పటికే తలకు తీవ్రగాయం కావడంతో స్పృహ కోల్పోయి ఉన్నాడు. తల కుడి వైపు భా గంలో నుజ్జునుజ్జయింది.

ఎముకలు తలలోనికి దిగబడ్డాయి. రంధ్రం ఏర్పడి మెదడు సైతం బయటికి వచ్చింది. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు వెంట నే ప్రైమరీ క్రెనియో ప్లాస్టి ఆపరేషన్ ప్రారంభించి టైటానియమ్ మెష్ ద్వారా బాలుడి తలకు పూర్వ స్థితి తీసుకురావడంలో విజయవంతమ య్యా మ ని తెలిపారు. 24గంటలు న్యూ రో సేవ లు అం దించడం, యూరోపియన్ టెక్నాలజీతో తయారైన మిషనరీ అందుబాటులో ఉండడంతో ఈ ఆపరేషన్‌ను సులభంగా నిర్వహించామని చెప్పారు. మత్తు మందు వైద్యులు వినయ్, మహేశ్, వైద్య శాల అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్ ఉన్నారు.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles