రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్లు ఎంపిక

Thu,October 17, 2019 02:01 AM

జగిత్యాల లీగల్ : రంగారెడ్డి జిల్లాలోని మియాపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి అండర్ 14 పాఠశాలల బాస్కెట్ బాల్ పోటీలకు ఇటీవల జగిత్యాలలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలబాలికల ఉమ్మడి జట్టును ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వొ డ్నాల శ్రీనివాస్ తెలిపారు. బాలికల విభాగంలో బీ ప్రియచర్నిత, కే హర్షిణి, పీ కావ్యశ్రీ, ఎన త్రివేణి, వీ శార్వాణి, పీ వెన్నెల, ఏ హన్సిక, సీహెచ్ సహస్ర, వి సంయామి, సీహెచ్ శ్రీ వైష్ణవి, వై అశ్మిత, అమతుల్ ముహేమిన్ తినూ, బాలుర విభాగంలో కేవీ శ్రీ సాయి వైష్ణవ్, కే పవన్, జె కార్తీక్, వీ ప్రవీణ్, కే సంతోష్, ఎం కిషోర్, డి అక్షిత్ సాయి, జే అఖిల్, డీ ఆదిత్య, ఎం ఆదర్ష్ పటేల్, కే రామ్‌చరణ్, ఎండీ సైఫుర్ రహెమాన్ ఎంపికయ్యారనీ, ఈ జట్టుకు కోచ్‌గా ఎస్ వేణు వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా పెటా అధ్యక్షుడు పీ విశ్వ ప్రసాద్, పీఈటీలు పీ కృష్ణ ప్రసాద్, ప్రేం రెడ్డి, కే అజయ్ బా బు, ఎం విద్యాసాగర్, ఎస్ వేణు, భాస్కర్, సా మంత్, విజ్ఞాన్, శ్రీరాం పాల్గొన్నారు. కాగా పోటీలకు ఎంపికైన విద్యార్థులు జిల్లాకు పేరు తేవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. అలాగే ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, క్రీడల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles