ముగిసిన జోనల్‌స్థాయి పోటీలు

Thu,October 17, 2019 02:01 AM

సిర్పూర్(టి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న గురుకులాల 6వ జోనల్‌స్థాయి క్రీడలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ పోటీల్లో ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి గురుకులాల క్రీడాకారులు పాల్గొన్నారు. హోరాహోరిగా పోటీలు కొనసాగాయి. ముగింపు వేడుకలకు కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ భోర్కుడే హేమంత్ హాజరయ్యారు. క్రీడలను నిర్వహించిన అధికారులను, ఉపాధ్యాయులను, పీడీలను ఆయన అభినందించారు. కాగా ఈ పోటీల్లో కరీంనగర్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. అనంతరం విజేతలకు బహుమతులతో పాటు మెమోంటోలను అందజేశారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles