బ్యాంక్ వివరాల కోసం అపరిచితుడి ఫోన్ కాల్

Sat,September 14, 2019 03:06 AM

-పోలీసులకు ఫిర్యాదు
జమ్మికుంట: బ్యాంక్ ఖాతా వివరాల కోసం ఓ అపరిచితుడి నుంచి ఖాతాదారుడికి ఫోన్ రాగా, ఖాతాదారుడు, సదరు బ్యాంక్ చీఫ్ మేనేజర్ అప్రమత్తతో సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మికుంట పట్టణానికి చెందిన తిప్పారపు సుధాకర్‌రావు అనే ప్రైవేట్ ఉద్యోగికి 7280835126 అనే నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పాలని ఓ అపరిచితుడు కోరగా, సుధాకర్‌రావు ఫోన్ కట్‌చేశాడు. అదే నంబర్ నుంచి ఈ సారి ఓ మహిళ మాట్లాడింది. వివరాల కోసం ప్రయత్నించింది. ఖాతాదారుడు ఫోన్ కట్ చేసి, వెంటనే తన ఖాతా ఉన్న ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీధర్‌రావుకు ఫోన్ చేశాడు. అపరిచితుల ఫోన్ వివరాలను తెలిపాడు. ఖాతా నుంచి నగదు పోయిందా? అని ఆరా తీశాడు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తంగా వ్యవహరించిన ఖాతాదారుడు సుధాకర్‌రావు, బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీధర్‌రావును పోలీసులు అభినందించారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles