ఇంటి నిర్మాణానికి అడ్డంకులు

Sat,September 14, 2019 03:05 AM

-సెల్ టవర్ ఎక్కిన తల్లీకొడుకులు
కరీంనగర్ క్రైం : తనకున్న స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటుంటే పక్కింటి యజమాని అడ్డంకులు సృష్టిస్తున్నాడని మనస్థాపానికి గురైన తల్లీ కొడుకులు సెల్ టవర్ ఎక్కిన ఘటన శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. భగత్‌నగర్‌కు చెందిన ప్రదీప్ తండ్రి పోలీస్‌శాఖలో ఏఎస్‌ఐగా పని చేస్తున్నాడు. తమకున్న గుంట స్థలంలో అనుమతులు తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు. పక్కింటి యజమాని ఇళ్లు నిర్మాణం చేస్తే పది లక్షలు తనకు ఇవ్వాలనీ, లేదంటే రూ. 5 లక్షలు ఇస్తా, స్థలం వదిలిపెట్టి పోవాలని గతంలో బెదిరించాడని తెలిపారు. అయినా ధైర్యం చేసి ఇళ్లు కట్టుకుంటుంటే తప్పుడు ఫిర్యాదు చేసి మున్సిపల్ అధికారులచే నిర్మాణం జరగకుండా అడ్డుకుంటున్నాడని వాపోయారు. మూడు రోజులుగా ఇంటి నిర్మాణం ఆపడంతో తల్లితో కలిసి వచ్చిన ప్రదీప్ ఇంటి సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న టీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ సునీల్‌రావు అక్కడికి చేరుకుని మున్సిపల్ అధికారులను పిలిపించి, మాట్లాడారు. నిబంధనల మేరకు నడుచుకోవాలనీ, బాధితుడిని ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించడంతో ప్రదీప్ తన ప్రయత్నాన్ని విరమించుకుని కిందికి దిగడంతో కథ సుఖాంతమైంది.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles