హిందీ ఆకృతిలో అల్ఫోర్స్ విద్యార్థులు

Sat,September 14, 2019 03:04 AM

కరీంనగర్ రూరల్: ఈ నెల 14న హిందీభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ కొత్తపల్లిలో విద్యార్థులు హిందీ ఆకృతిలో కూర్చొని ఆకట్టుకున్నారు. శనివారం పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలను హిందీ భాషలో నిర్వహిస్తున్నట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతిఏటా పాఠశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామన్నారు. ప్రతి విద్యార్థికి హిందీ భాషా పరిజ్ఞానం అవసరమనీ, భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులందరూ హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని నరేందర్‌రెడ్డి సూచించారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles