సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు

Sun,August 25, 2019 01:11 AM

హుజూరాబాద్‌టౌన్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి రాంమనోహర్ రావు తెలిపారు. హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని దవాఖానల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. గత మేలోనే మందులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రెండో విడుతలో భాగంగా జూలై నెలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మందులు పంపిణీ చేశామన్నారు.

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి సీజనల్ వ్యాధులపై సర్వే చేసినట్లు తెలిపారు. గర్భిణులు ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానకే రావాలని కోరారు. ప్రతి దవాఖానలో వైద్యులు 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజమౌళి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రవీన్‌రెడ్డి, వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, జమ్మికుంట దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనితరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles