త్వరలోనే పంటలకు సాగునీరు

Sun,August 25, 2019 01:10 AM

చిగురుమామిడి: త్వరలోనే మిడ్ మానేరు ద్వారా నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామనీ, నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సుందరగిరి, నవాబ్‌పేట, ఇందుర్తి గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, శ్మశాన వాటిక నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ చేశారు. అనంతరం ఇందుర్తి, నవాబ్‌పేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ, ఇందుర్తి నియోజకవర్గంగా ఉన్నప్పుడు పూర్తిగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించలేకపోయిందనీ, తెలంగాణ సర్కారు అధికారంలోకి రాగానే గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే ధ్యేయమనీ, రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనే తపనతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగిందన్నారు.

మండలంలోని అన్ని గ్రామాలకు తారు రోడ్లు వేయిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, సర్పంచ్‌లు శ్రీమూర్తి రమేశ్, సుద్దాల ప్రవీణ్, అందె స్వరూప, ఎంపీటీసీలు మంకు స్వప్న, అందె స్వప్న, ఎంపీడీవో అలుగోజు కుమారస్వామి, పంచాయతీరాజ్ ఏఈ రవికుమార్, మాజీ జడ్పీటీసీ అందె స్వామి, టీఆర్‌ఎస్ మండల బాధ్యుడు సాంబారి కొంరయ్య, నాయకులు మంకు శ్రీనివాస్‌రెడ్డి, తోట సతీశ్, మక్బుల్‌పాషా, బోయిని సది, హన్మాండ్ల సత్యనారాయణ, కంది రాజశేఖర్‌రెడ్డి, వరుకోలు శ్రీనివాస్, విష్ణమాచారి, షిరాజ్, కంది శ్రీలత, చింతపూల శ్యామల, సుదగోని శ్రీను, చింతపూల ఆంజనేయులు, చెప్యాల సంతోష్, వార్డు సభ్యులు, తదితరులున్నారు. అనంతరం ఇందుర్తిలో హరితహారం మొక్కలు నాటారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles