పేదలకు సీఎంఆర్‌ఎఫ్ అండ

Sun,August 25, 2019 01:10 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) పేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. స్థానిక మీసేవా కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ కింద రూ. 33.65 లక్షల చెక్కులను లబ్ధ్దిదారులకు శనివారం ఆయన అందజేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువస్తున్నదనీ, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాయకులు బండారి వేణు, సుంకిశాల సంపత్‌రావు, నాంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles