లక్ష్యానికి మించి టీఆర్‌ఎస్ సభ్యత్వాలు

Sun,August 25, 2019 01:08 AM

జమ్మికుంట : మున్సిపల్ పరిధిలో టీఆర్‌ఎస్ సభ్యత్వాలు లక్ష్యానికి మించి నమోదయ్యాయనీ, మొత్తం 15 వేలు చేసినట్లు పార్టీ అర్బన్ శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టామనీ, పూర్తి చేసిన సభ్యత్వ నమోదు బుక్కులను రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌కు అప్పగించినట్లు చెప్పారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదులో అన్ని వర్గాలు పాల్గొన్నాయనీ, అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

సభ్యత్వ నమోదుతో బీమాను అందిస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటేననీ, ప్రతి సభ్యుడికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా సభ్యత్వాలు జరిగాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలనీ, ఎన్నికలు ఏవైనా గులాబీ జెండానే ఎగిరేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles