రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

Sun,August 25, 2019 01:08 AM

వేములవాడ కల్చరల్: వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆ లయంలో భక్తుల రద్దీగా నెలకొంది. శనివారం వేకువజాము నుంచే భక్తు లు తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి క్యూలై న్లో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని ప్ర త్యేక పూజలను చేశారు. ప్రీతి మొక్కైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. భక్తులు క ల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఎత్తు బెల్లాన్ని పంచిపెట్టారు. అభిషేకపూజలు, అన్నపూజ లు, కుంకుమ పూజలు, ఆకులపూజ లు నిర్వహించు కున్నారు. కల్యాణ మొక్కులు, పల్లకి సేవలు, పెద్దసేవల మొక్కులు తీర్చుకున్నారు. రాజన్న ను దాదాపు 10 వేల మంది భక్తులు దర్శించుకోగా, వివిధ ఆర్జితసేవల ద్వారా ఆలయానికి సుమారు రూ.8 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుం డా ఏఈవో ఉమారాణి, పర్యవేక్షకులు నటరాజ్, శ్రీరాములు, మహేశ్‌గౌడ్, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, భూపతిరెడ్ది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. రాజన్న ఆలయ అనుబంధ ఆలయాల వద్దా భక్తుల సం దడి కనిపించింది.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles