పారిశుధ్యం, నీటి సంరక్షణపై పరిశీలన

Sat,August 24, 2019 12:50 AM

శంకరపట్నం, సైదాపూర్/మానకొండూర్ రూరల్: జిల్లాలో రెండో రోజు స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందాల పర్యటన కొనసాగింది. శుక్రవారం శంకరపట్నం మండలం అంబాల్‌పూర్, మొలంగూర్, సైదాపూర్ మండలంలోని సైదాపూర్, ఆకునూర్, మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామాల్లో కేంద్ర బృందాలు వేర్వేరుగా పర్యటించాయి. ఆయా బృందాల సభ్యులు రమేశ్, మాధవి, రజిత, ఉదయశ్రీ, ఆశుమాల్ పారిశుధ్యం, నీటి సంరక్షణ అంశాలపై పరిశీలన జరిపారు. ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, దేవాలయాలు, మసీదులను సందర్శించి పరిశీలించారు. ఆయా ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్వహణను చూశారు. ఇంకుడు గుంతల ఏర్పాటు, పారిశుధ్య విజలెన్స్ కమిటీలు, కిచెన్ గార్డెన్, చెత్తకుండీల నిర్వహణ, తడిపొడి చెత్త సేకరణ, చెత్తకుండీల నిర్వహణ, మురుగు నీటి వ్యవస్థ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఫొటో క్యాప్చరింగ్ నిర్వహించారు. సైదాపూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాన్ని పరిశీలించి, సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం పరిశుభ్రత ఎంతగా మెరుగుపడింది..? ఘన పదార్థాల సేకరణ ఎంతవరకు వరకు మెరుగుపడింది..? వ్యర్థ పదార్థాల సేకరణకు అవసరమైన వస్తువులు ఏమైనా తక్కువ ఉన్నాయా..? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

మొబైల్ యాప్ ఎస్‌ఎస్‌జీ-2019లో తమ అభిప్రాయం తెలియజేయాలని గ్రామస్తులకు సూచించారు. అలాగే సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్వచ్ఛత ఆధారంగా అక్టోబర్ 2న ఆదర్శ గ్రామాల ప్రకటన వెలువడుతుందని తెలిపారు. వారి వెంట శంకరపట్నం ఎంపీపీ సరోజన, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, యునిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్‌స్వామి, ఎంపీడీవో వినోద, వైస్ ఎంపీపీ రమేశ్, ఈవోపీఆర్డీ చండీరాణి, ఏఈ మొగిళి, సర్పంచులు మంజ వసంత, మోరె అనూష, ఎంపీటీసీలు గాండ్ల తిరుపతయ్య, మొయిన్, ఉప సర్పంచులు మడ్డి రవి, మేడుదుల వెంకన్న, కార్యదర్శులు ప్రవీణ్, రాంమోహన్, వార్డు సభ్యులు, సైదాపూర్, ఆకునూర్‌లో జిల్లా స్వచ్ఛభారత్ ప్రతినిధి రమేశ్, ఎంపీడీవో పద్మావతి, సర్పంచ్‌లు చంద శ్రీనివాస్, ముత్యాల రమణారెడ్డి, ఎంపీటీసీలు తొంట ఓదెలు, బద్దిపడిగె అనిత, పచ్చునూర్‌లో ఎస్‌బీఎం రమేశ్, సర్పంచ్ వసంత, వైస్ ఎంపీపీ గోపు మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో దేవదాస్, ఫెసిలేటర్ కల్యాణి, రవి, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గ్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles