రిటైర్డ్ ఆర్మీజవాన్‌కు ఎమ్మెల్యే రవిశంకర్ నివాళి

Fri,August 23, 2019 02:26 AM

చొప్పదండి, నమస్తేతెలంగాణ: మండలంలోని భూపాలపట్నానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ మాచర్లబాబు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బిలాయ్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందగా, గురువారం గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ పాల్గొన్నారు. మాచర్లబాబు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. శవపేటికను మోశారు. దేశసరిహద్దులో విధులు నిర్వహించి దేశరక్షణకై పాటుపడిన బాబు రోడ్డుప్రమాదంలో మృతిచెందడం బాధాకరమనీ, ఆయన మృతి తీరని లోటని అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, నాయకులు ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మాచర్ల వినయ్, తిరుపతిరెడ్డి, మచ్చ రమేశ్, చేపూరి రవీందర్, శ్రీనివాస్, తదితరులున్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles