అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి

Fri,August 23, 2019 02:25 AM

పెగడపల్లి : రైతుల సంక్షేమం కోసం అత్యంత వేగంగా నాణ్యతతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45లక్షల ఎకరాలకు సాగునీరంది తెలంగాణ సస్యశ్యామలం కానున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి గురువారం పెగడపల్లి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని, అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు 260 కేసులు వేశాయనీ, వాటిని సీఎం కేసీఆర్ ధైర్యంగా ఎదుర్కొని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశారనీ, నిర్మాణం పూర్తయ్యాక వాటి ద్వారా చుక్క నీరు కూడా రాదని విమర్శించిన ప్రతిపక్ష నేతలు, ఇప్పుడు పుష్కలంగా నీరు చేరాక, కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రయోజనకరమైనదనీ, దీని ద్వారా సాగు, తాగు నీటికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఐతుపల్లి సమస్య తొలగిపోయిందనీ, నందగిరికి బాకీ ఉందనీ, కొద్ది రోజుల్లోనే ఇక్కడి సమస్యను కూడా పరిష్కరిస్తానని పేర్కొన్నారు. మంత్రి ఈశ్వర్‌ను ఐతుపల్లి గ్రామ రైతులు సన్మానించారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles