తూముల ఏర్పాటుతో చెరువులకు జలకళ

Thu,August 22, 2019 02:07 AM

గంగాధర: రాష్ట్ర సర్కారు వరదకాలువకు తూములు ఏర్పాటు చేయడంతో చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గంగాధర మండలం బూరుగుపల్లి వద్ద రూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన తూము వద్ద బుధవారం ఆయన పూజలు చేసి, ఊర చెరువుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో వరదకాలువ నీరు లేక ఎడారిలా కనిపించేందనీ ఆవేదన వ్యక్తంచేశా రు. తూములు ఏర్పాటు చేసి చెరువులు నింపాలని కోరితే అప్పటి ఆంధ్రా అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతు సంక్షేమ ప్రభుత్వం ఏర్పడిందనీ, వరదకాలువకు తూ ములు ఏర్పాటు చేసి గ్రామాల్లో చెరువులు నింపి బీడు భూములన్నీ సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇందులో భాగంగానే గంగాధర మండల ర్యాలపల్లి, బూరుగుపల్లి, కొండన్నపల్లి, తాడిజెర్రి, ఆచంపల్లి వద్ద వరదకాలువకు ఐదు తూములు ఏర్పాటు చేశారని చెప్పా రు. రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పం పుహౌస్ ద్వారా వరదకాలువకు నీటిని విడుదలతో తూముల ద్వారా చెరువుల్లోకి నీరు చేరుతోందని, ఆయా గ్రామాల్లో చెరువులు జలకళను సంతరించుకుంటు న్నాయన్నారు. చెరువులు నిండితే వేలాది ఎకరాలకు సాగు నీరు అంది పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉంటారన్నారు. నాయకులు సాగి మహిపాల్‌రావు, పుల్కం నర్సయ్య, దూలం శంకర్‌గౌడ్, గడ్డం అంజయ్య, విలాసాగరం గంగయ్య, గడ్డం స్వామి, ఆంజనేయులగౌడ్ ఉన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles