భూసమస్యల పరిష్కారానికే రైతుబాట

Thu,August 22, 2019 02:07 AM

గన్నేరువరం: మండలంలో నెలకొన్న భూసమస్యలను పరిష్కరించడానికే రైతుబాట కార్యక్రమం నిర్వహిసున్నట్లు ఆర్డీవో ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు పారువెల్ల గ్రామాల్లో రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను బుధవారం ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మోకాపై ఉన్న వారిని, పక్క భూమి వారిని విచారించి పాసుపుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. రైతుబాట కార్యక్రమాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాసిల్దార్ జి.ప్రభాకర్, డీటీ కమ్రొద్దీన్, ఆర్‌ఐ గడ్డం శంకర్, వీఆర్‌వో భగవాన్‌రెడ్డి, సర్పంచులు తీగల మోహన్‌రెడ్డి, పుల్లెల లక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

మానకొండూర్ రూరల్: రైతుల భూసమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ ఆనంద్‌కుమార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో బుధవారం రెవెన్యూ సిబ్బంది నిర్వహించిన ఇంటింటి సర్వేను ఆయన తాసిల్దార్ శ్రీనివాస్‌తో కలిసి పర్యవేక్షించారు. రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి భూ సమస్యను రికార్డులో నమోదు చేసి, పరిష్కరించేలా చూడాలన్నారు. విరాసత్, మ్యూటేషన్, తదితర సమస్యలను వీఆర్‌ఓలు త్వరగా పూర్తి చేసి, రైతులకు జవాబుదారీగా ఉండాలని సూచించారు.ఎలక్షన్ నాయబ్ తాసిల్దార్ ముజామిల్, గిర్దవార్లు శ్రీనివాస్, రాఘవేందర్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles