భూసమస్యలన్నింటినీ పరిష్కరించాలి

Thu,August 22, 2019 02:06 AM

శంకరపట్నం: గ్రామాల్లో ఏ ఒక్క రైతుకు భూ స మస్య ఉండొద్దనీ, ప్రతి సమస్యను పరిష్క రిం చాలని జేసీ శ్యాంప్రసాద్ లాల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం శంకరపట్నం మండలంలో ఎరడపల్లి, అంబాల్‌పూర్ గ్రామాల్లో రైతుబాటలో భాగంగా తాసిల్దార్ విజయలలిత, నాయబ్ తాసిల్దార్ నాగార్జున రెండు బృందాలు గా విడిపోయి ఇంటింటా సర్వే చేశారు. ఈ సందర్భంగా జేసీ ఎరడపల్లి రైతుబాటను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రా మంలో గల భూ సమస్యల వివరాలను తాసిల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులతో మాట్లాడారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ రైతు సమస్యలను పరిశీలించుటకే రైతుబాట కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే అన్నారు. రైతుబాట చేపట్టిన గ్రామంలో పూర్తి సమస్యలు పరిష్కరించాకే మరో పల్లెలో రైతుబాట నిర్వహించాలన్నారు. పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు వీఆర్వోలు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా పలువురి రైతుల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రంజిత్‌రావు, వీఆర్వోలు దేవేందర్, మాదయ్య ఉన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles