రోటా వ్యాక్సిన్‌పై శిక్షణ

Thu,August 22, 2019 02:06 AM

కరీంనగర్ హెల్త్ : రోటా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాంమనోహర్‌రావు సూచించారు. బుధవా రం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పీహె చ్‌సీల పర్యవేక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో రోటా వైరస్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ వ్యాక్సిన్ నవజాత శిశువులకు వివి ధ రకాల వ్యాధుల నుంచి రక్షణ, పిల్లల్లో నీళ్ల విరేచనాల ద్వారా సంభవించే మరణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నారు. దేశంలో నమోదయ్యే 40 శాతం మరణాలకు రోటా వైరస్ కారణమన్నారు. టీకా మందు ను సూ దిమందు లాగా ఇవ్వకుండా 2.5 ఎం ఎల్ ద్రావణాన్ని నోటి ద్వారానే ఇవ్వాలన్నా రు. డాక్టర్ బంగారి రజనిప్రియదర్శిని, డిప్యూ టీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిసింగ్, జువేరియా, దుర్గారావు, పుష్ప పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles