రూపాయికే అంతిమయాత్రపై అధ్యయనం

Wed,August 21, 2019 04:32 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్ నగరపాలక సంస్థలో అమలవుతున్న రూపాయికే అంతిమయాత్ర కార్యక్రమాన్ని ఖమ్మం కార్పొరేషన్‌కు చెందిన కార్పొరేటర్లు మంగళవారం పరిశీలించారు. ముందుగా నగర కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డిని కలుసుకున్నారు. అనంతరం టవర్‌సర్కిల్‌లో మాజీ మేయర్ రవీందర్‌సింగ్‌ను కలుసుకొని వివరాలను తెలుసుకున్నారు. అమలు తీరును పరిశీలించారు. ఖమ్మం నగరపాలక సంస్థలో ప్రవేశపెట్టేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు. నగరపాలక అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles