మహాభారతంతో ఆధ్యాత్మిక చింతన

Mon,August 19, 2019 01:21 AM

కరీంనగర్ కల్చరల్: మానవ జీవిత విలువల కోసం మహాభారతాన్ని చదవాలని, వినాలని పురాణం మహేశ్వరశర్మ ఉద్భోదించారు. ఇటీవల జరిగిన శ్రీమన్మహాభారత ప్రవచనంలో భాగంగా ఫలశృతి(ముగింపు) ఆదివారం కమాన్‌రోడ్‌లోని రామేశ్వరాలయంలో చేశారు. మహేశ్వరశర్మ మాట్లాడుతూ మహాభారతంతో ఆధ్యాత్మిక చింతన అలవడతుం దన్నారు. వ్యాసుడు అద్భుత జాన గ్రంథాన్ని అందించి జగద్గురువు అ య్యారని అన్నారు. ఇతిహాసం తెలుసుకోవడానికి కాకుండా తూలనాత్మక దృష్టితోనైనా భారతం చదివితే మనమేమిటో మనకు తెలుస్తుందని అన్నారు. అంతకుముందు గ్రంధ పూజ చేశారు. ఫలశృతి అనం తరం మహేశ్వరశర్మను ఘనంగా సన్మానించారు. ప్రతి రోజు ప్రవచనాన్ని విజయంతం చేసినందుకు మహాభారత శ్రవణ సమతి జిల్లా కన్వీనర్ చల్లా మోహన్‌రెడ్డి బాధ్యులు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అన్నాదానం చేశారు. సమితి కన్వీనర్ చల్లా మోహన్‌రెడ్డి, కాశీనాథం, కొంతం కృష్ణమూర్తి, నీరుమల్ల తిరుపతి, తణుకు శ్రీధర్, అశోక్‌కుమార్, రామేశం, బండ సత్తయ్య, కొండ శ్రీనివాస్, మంచాల సదారమణ, పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles