వినోద్‌కు శుభాకాంక్షలు

Mon,August 19, 2019 01:21 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా నియమితులైన వినోద్‌కుమార్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీఆర్‌ఎస్ జిల్లాకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు, ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మ ణ్‌రావు, మాజీ కార్పొరేటర్ వై సునీల్‌రావు, మ హిపాల్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెప్పారు. టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌తో కలిసి నేతలు పల్లే రవీందర్‌గౌడ్, కత్తి శ్రీనివాస్, గంగాధర చందు, పర్శురాం, శ్రావణ్‌రెడ్డి కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. వీరితో పాటుగా మాజీ కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్‌లు, పెద్దపల్లి రవీందర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, చెన్నాడి సుధాకర్‌రావు వినోద్‌కు అభినందనలు తెలిపారు.
మాజీ మేయర్ రవీందర్‌సింగ్..
సుభాష్‌నగర్: వినోద్‌కుమార్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కరీంన గర్ మాజీ మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. వినోద్ నేతృత్వం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని నాయకులు ఆకాంక్షించారు. ఇక్కడ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, మైకేల్ శ్రీనివాసు, దండబోయిన రాము, కొ త్వాల శ్రీనివాస్ ఉన్నారు. తెలంగాణ సాంస్కృ తిక గాయని వొల్లాల వాణికి షోర్, కరీంనగర్ మా జీ కార్పొరేటర్ తాటి ప్రభా వతి వినోద్‌ను కలిసి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles