దరఖాస్తుల ఆహ్వానం

Sun,August 18, 2019 01:11 AM

తిమ్మాపూర్ రూరల్: ఎల్‌ఎండీ కాలనీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పోహార్ దత్తాద్రి శనివారం తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి సీసీ కెమెరా, సెక్యూరిటీ అలారం, స్మోక్ డిటెక్టర్ ఇన్‌స్టాలేషన్, సర్వీసింగ్‌లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పురుష అభ్యర్థులు ఎల్‌ఎండీ కాలనీలోని సంస్థ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి కల్పిస్తామని వెల్లడించారు.

పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు, ఆహారభద్రత కార్డు ఉండి, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పదో తరగతి మెమో, ఆధార్‌కార్డు, ఆహార భద్రత కార్డు, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు 5 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఈనెల 25వ తేదీలోపు సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. వివరాలకు సెల్ నంబరు 99494 48157, 9849411002లో సంప్రదించాలన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles