తూముల ఏర్పాటుతో గొలుసుకట్టుకు జలకళ

Sun,August 18, 2019 01:10 AM

-వరదకాలువ ద్వారా చెరువుల్లోకి నీరు
గంగాధర: వరద కాలువకు గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తూములతో చొప్పదండి నియోజకవర్గంలో గల వివిధ మండలాల్లోని గొలుసుకట్టు చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. మధ్యమానేరుకు కాళేశ్వరం జలాలు వస్తుండడంతో ఈ తూముల ద్వారా కిందనున్న చెరువులకు నీరు చేరుతోంది. గతేడాది గంగాధర మండలం తాడిజెర్రి సమీపంలో వరదకాలువపై రూ.40 లక్షలతో ప్రభుత్వం తూము ఏర్పాటు చేసింది. దీనిద్వారా మండలంలోని గట్టుభూత్కూర్ ఊరచెరువుతో పాటు రామడుగు మండలం వెలిచాల పెద్ద చెరువు, చిన్న చెరువు నింపడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గతంలో ఉన్న కాలువ ద్వారా ఈ తూము నుండి గట్టుభూత్కూర్, వెలిచాల చెరువులకు నీరు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. గతేడాది ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి వరద కాలువకు ప్రభుత్వం నీటిని విడుదల చేసిన సమయంలో తూము కంటే కాలువ ఎత్తులో ఉండడంతో చెరువుల్లోకి నీరు చేరలేదు. దీంతో రైతుల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రస్తుత సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్‌రావు వరదకాలువ తూము నుండి చెరువులకు నీరు వచ్చేందుకు అనువుగా సొంత ఖర్చులతో కాలువకు మరమ్మతు చేయించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌజ్ ద్వారా నీటిని విడుదల చేయడంతో వరదకాలువలో నీరువస్తున్నది. దీంతో తాడిజెర్రి తూము నుండి గట్టుబూత్కూర్ చెరువులోకి వరద నీరు చేరుతోంది. ఈ చెరువు నిండిన తర్వాత వెలిచాల గ్రామ పెద్ద చెరువు, చిన్న చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. మూడు చెరువులు నిండితే గట్టుభూత్కూర్, వెలిచాల గ్రామాలతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో దాదాపు వెయ్యి ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. కాలువను మరమ్మతులు చేయించి చెరువుల్లోకి నీరు చేరేలా సహకరించిన సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్‌రావుకు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles