పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన

Sat,August 17, 2019 03:57 AM

శంకరపట్నం: మొలంగూర్ పంచాయతీ పరిధిలోని నల్లవెంకయ్యపల్లిలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం ప్రత్యేకాధికారి జయశంకర్, ఎంపీడీఓ వినోద సందర్శించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. అలాగే శిథిలావస్థలో ఉన్న తరగతి గదిని కూల్చి వేయాలని ఎంపీడీఓ ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. వంటగది నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లగా నలుగురు చిన్నారులు మాత్రమే కనిపించారు. హాజరు పట్టికను పరిశీలించి, అంగన్‌వాడీ టీచర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఏపీఓ శారద, టీఏ సుమలత, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్ ఉన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles