మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

Sat,August 17, 2019 03:56 AM

శంకరపట్నం: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా భావించాలని హరితహారం ప్రత్యేకాధికారి జయశంకర్ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా శుక్రవారం ఈజీఎస్ ఆధ్వర్యంలో మొలంగూర్ ఖిల్లా వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ ప్రస్తుతం మనం నాటుతున్న మొక్కలు భావితరాలకు నీడనిస్తాయని అన్నారు. ఇంటింటా మొక్కలు నాటి, నీళ్లు పోసి సంరక్షించాలని కోరారు. ఎంపీడీఓ వినోద, ఏపీఓ శారద, టీఏ సుమలత, ఫీల్డ్ అసిస్టెంట్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles