ఒంటికి నిప్పంటించుకొని వివాహిత ఆత్మహత్య

Fri,August 16, 2019 04:07 AM

చొప్పదండి, నమస్తేతెలంగాణ: మండల కేంద్రానికి చెందిన బుర్ర రేణుక(33) ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ శేరాలు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుక భర్త శ్రీనివాస్ అప్పులు చేసి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ సరైన పని దొరకకపోవడంతో 15 రోజుల క్రితం తిరిగి వచ్చాడు. దీంతో దుబాయ్ వెళ్లడానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మనోవేధనతో బాధపడుతున్న రేణుక బుధవారం సాయంత్రం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. కుటుంబసభ్యులు వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి తండ్రి చేపూరి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles