పంద్రాగస్టుకు ముస్తాబు

Thu,August 15, 2019 03:20 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానాన్ని ముస్తాబు చేశారు. గురువారం మువ్వన్నెల పండుగను ఘ నంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇందు కు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరిస్తారని వెల్లడించారు. 10.10 గంటలకు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలాపై ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పా రు. 10.25గంటలకు వివిధ ప్రభుత్వ శాఖలు రూ పొందించిన శకటాల ప్రదర్శన, 10.45 గంటలకు వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 11.15 ఉత్తమ సేవలందించిన ప్రభుత్వోద్యోగులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంస పత్రాల ప్రదానం, 11.45 లబ్ధిదారుల ఆస్తుల పంపిణీ ఉంటుందని తెలిపారు.

ఏర్పాట్లు పరిశీలించిన జేసీ..
పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాట్లను జేసీ జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్ బుధవారం ఉదయం పరిశీలించారు. అధికారులకు సలహాలు సూచనలు చేశారు. ఇక్కడకు వచ్చే అతిథులతోపాటు ప్రజల కు అన్ని ఏర్పాట్లూ చేయాలనీ, స్వాతంత్ర సమరయోధుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలనీ, అరటిపండ్లు అందజేయాలన్నారు. వేడుకల్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఆయన వెం ట రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్‌కుమార్, కరీంనగర్ ఆర్బన్ తాసిల్దార్ కనుకయ్య ఉన్నారు.

వేడుకల్లో ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ : జేసీ
వేడుకల్లో ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ ఉంటుందని జేసీ శ్యాంప్రసాద్ లాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నెల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందనీ, ఐదు ఆవిష్కరణలను వేడుకల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేయని వారు కూడా ఆవిష్కర్తలుగా మారడానికి అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకే కొత్త ఆవిష్కరణల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles