మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం

Thu,August 15, 2019 03:19 AM

కరీంనగర్ స్పోర్ట్స్: ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్రమనీ, దేశభక్తితోపాటు పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం భారత స్వాతంత్య్ర సైక్లింగ్ ర్యాలీని నిర్వహించినట్లు కన్వీనర్ డా.వీ నరేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డా. మధుసూదన్‌రెడ్డిలు పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుంచి భారత స్వాతంత్య్ర సైక్లింగ్ పేరుతో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి జేసీ శ్యాంప్రసాద్‌లాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, దినచర్యలో సైకిల్‌ను భాగంగా చేసుకుంటే ఆరోగ్యమైన జీవితాన్ని గడుపవచ్చన్నారు. అసోసియేషన్ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు వీ నరేందర్‌రెడ్డి, బీ మధుసూదన్‌రెడ్డిలు మాట్లాడుతూ, సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పర్యావరణ సమతుల్యతను పాటించవచ్చని సూచించారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ అని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. నగరంలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని వారి సైకిళ్లకు జాతీయ పతాకాలను ఆవిష్కరించి భారత్ మాతాకీ జై, స్వతంత్య్ర భారత్‌కీ జై, హామారా భారత్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ కోర్టు చౌరస్తా మీదుగా ఆర్‌అండ్‌బీ చౌరస్తా, పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, బస్‌స్టేషన్ మీదుగా తెలంగాణ చౌక్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురభి వేణుగోపాల్, బాధ్యులు రాజయ్య, రమేశ్, జగదీశ్వరాచారి, అరవింద్, మెతుకు సత్యం, డా.అజయ్ ఖండల్, కోచ్‌లు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles