అద్భుతం.. జలదృశ్యం

Wed,August 14, 2019 01:13 AM

-గాయత్రి పంప్‌హౌస్‌లో ఒకేసారి నాలుగు, ఐదు మోటర్ల వెట్ ట్రయల్ రన్
-సందర్శించిన ఎమ్మెల్మే సుంకె రవిశంకర్
రామడుగు : రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ గాయత్రి పంప్‌హౌస్‌లో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైంది. ఒకేసారి రెండు బాహుబలి మోటర్లు నడవడంతో గంగమ్మ ఉప్పొంగింది. మంగళవారం రాత్రి 8.30గంటలకు ఐదో మోటర్‌కు వెట్ ట్రయల్న్ చేసి, సుమారు అరగంటపాటు నడిపించారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్ డెలివరీ సిస్టర్న్ వద్దకు చేరుకుని ఎగిసిపడుతున్న జలాలను పరిశీలించారు. తిరిగి రాత్రి 9.17 నాలుగో మోటర్‌ను ఈఎన్‌సీతో కలిసి లిఫ్ట్ అడ్వయిజర్ పెంటారెడ్డి ఆన్‌చేశారు. అది నడుస్తుండగానే 10.02గంటలకు ఐదో మోటర్‌ను మరోసారి ప్రారంభించారు. రెండు డెలివరీ సిస్టర్న్ నుంచి ఉప్పొంగుతున్న జలాలను ఈఈ, డీఈ గోపాలకృష్ణ పరిశీలించారు. ఈ మోటర్లను ఐదు నుంచి ఆరు గంటల పాటు నడుస్తాయని అధికారులు తెలిపారు.

సందర్శించిన ఎమ్మెల్యే..
రెండు మోటర్లను ప్రారంభించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాత్రి 10గంటల సమయంలో గాయత్రి పంపుహౌస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మోటర్ల పనితీరును ఈఈ శ్రీధర్ వివరించగా, ఎమ్మెల్యే ఆసక్తిగా తెలుసుకున్నారు. డెలివరీ సిస్టర్న్‌ల నుంచి దూకుతున్న జలాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులతో కలిసి విజయసంకేతం చూపుతూ సంబురపడ్డారు. ఆయన వెంట గంగాధర ఎంపీపీ మధుకర్ తదితరులు ఉన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles