24 గంటల పాటు వైద్య సేవలు

Wed,August 14, 2019 01:10 AM

హుజూరాబాద్‌టౌన్: హుజూరాబాద్ ప్రాంతీయ ఆ రోగ్యకేంద్రంలో ప్రజలకు 24 గంటల పాటు వైద్య సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వీ రవిప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 100 పడకలను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. మంగళవారం దవాఖానలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి హెల్ప్‌డెస్క్ 24గంటల పాటు పని చేస్తుందన్నారు. 7901063416, 9849 141258 సెల్ నంబర్లలో సంప్రదించాలని సూ చించారు. త్వరలోనే హిస్ట్రెక్టమి శస్త్రచికిత్సలను ప్రా రంభిస్తామన్నారు. సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇందుకు వినూత్నంగా యో గా కాన్పులకు శ్రీకారం చుట్టామన్నారు.కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రసవం చేయించుకున్న వారికి రూ. 100 చెల్లిస్తే ప్రత్యేక గదులను కేటా యిస్తామని పేర్కొన్నారు. తాను బాధ్యతలు తీసుకున్న ఈ నెల 1 నుంచి 12 వరకు 25 కాన్పులు చేయగా అందులో ఐదు సాధారణ, 8 ఎమర్జెన్సీ , డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 3 హైరిస్క్ కేసుల్లో గర్భిణులకు ప్రసవం చేశామని చెప్పారు.

ప్రతినెలా పాత్రికేయుల సమావేశం..
ప్రతి నెలా మొదటి వారంలో పాత్రికేయుల సమావేశం పెట్టి దవాఖాన స్థితిగతులను తెలియజేసి స లహాలను, సూచనలను స్వీకరిస్తామన్నారు. 3వ వారంలో ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నా యకులతో సమావేశమై వైద్యశాల స్థితిగతులపై చర్చి స్తామని చెప్పారు. ఈ నెల 15 నుంచి ప్రతి రోజు ప్రత్యేక వైద్యనిపుణులను అందుబాటులో ఉంచు తామని పేర్కొన్నారు. సోమవారం కంటి వైద్యు డు, మంగళవారం ఈఎన్‌టీ వైద్య నిపుణురాలు, బుధవారం పిల్లల వైద్యుడు, గురువారం జనరల్ ఫిజిషియన్, శుక్రవారం ఆర్థో(బొక్కల వైద్య నిపుణుడు), శనివారం అన్ని రకాల జనరల్ సర్జన్లు, 24 గంటల పాటు ఒక గైనకాలజిస్ట్ అందుబాటు లో ఉంటారన్నారు. అంతేకాకుండా జనన ధ్రువీ కరణ పత్రాలను దవాఖానలో అందజేస్తామని చెప్పారు. ద్వారం వద్ద మీ సేవలో మన వైద్యులు అనే నినాదంతో బోర్డును ఏర్పాటు చేశామన్నారు. గర్భిణులు 3 వ నెల నుంచి ప్రసవం చేయించుకుని ఇంటికి వెళ్లే వరకు 102 వాహన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి రోజూ డ్యూటీ వైద్యులు ఉద యం 9గంటల నుంచి మ ధ్యాహ్నం 2 వరకు, ఆదివారం, రెండో శనివారం, పండుగల దినాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అందుబాటులో ఉంటాడన్నారు. రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయనున్నట్లు చెప్పారు. ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 24న మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles