వైభవంగా నృసింహస్వామి కల్యాణం

Wed,August 14, 2019 01:09 AM

తిమ్మాపూర్, నమస్తేతెలంగాణ: మహత్మానగర్ తాపాల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం మంచి ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కల్యాణాన్ని అర్చకులు తిరునగరి వెంకటాద్రి స్వామి నేతృత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం, సాయం త్రం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సం ఖ్యలో తరలివచ్చి కల్యాణ వేడుకను తిలకించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, జడ్పీ సభ్యురాలు ఇనుకొండ శైలజ, సర్పంచ్ జక్కని శ్రీవాణి, ఉప సర్పంచ్ మడుపు శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ కమిటీ బాధ్యులు సింగిరెడ్డి ఎల్లారెడ్డి, వడ్లకొండ లింగ య్య, పెండ్యాల కొండాల్‌రెడ్డి, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, రామడుగు సంపత్, పెండ్యాల రామకృష్ణారెడ్డి, స త్యనారాయణరెడ్డి, విజేందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, తి రుపతి, లింగారెడ్డి, కనుకయ్య, చంద్రయ్య, వెం కటపతి, సాగర్, బాలరాజు, మల్లయ్య, ఎల్ల య్య, భూంరెడ్డి, అర్చకులు తిరుమలగిరి చక్రధరస్వామి, సౌమిత్రి రామానుజాచార్యులు, సుగుణాకరాచార్యులు, శ్రవన్‌కుమారాచార్యులు, హర్షవర్షన్, కిరణ్‌కుమారాచార్యులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించనున్నారు. మ ధ్యాహ్నం అన్నదానం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

వీర బ్రహ్మేంద్రస్వామి కల్యాణం..
రామడుగు: మండల కేం ద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని మం గళవారం మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. ఆలయ ఆవరణలో అలంకరించిన మండప వేదికపై వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవ మేర్తులకు కల్యాణం జరిపించారు. మహిళాభక్తులు ఒడి బియ్యం, కానుకలు సమర్పించారు. సాయంత్రం రథోత్స వం నిర్వహించారు. భక్తులు పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంజాల ప్రమీల జగన్‌మోహన్‌గౌడ్ దంపతులు, ఎంపీటీసీ బొమ్మరవేణి తిరుపతి తిరుమల దంపతులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు కడర్ల లక్ష్మణ్, కార్యదర్శి కట్ట వెంకటేశ్వర్లు, కోశాధికారి వడ్లూరి రాజేందర్, ఉపాధ్యక్షుడు హన్మండ్లు, విరాట్ యూత్‌క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles