నగరంలో క్లినికల్ ట్రయల్స్?

Wed,August 14, 2019 01:08 AM

కరీంనగర్ క్రైం : కరీంనగర్‌లో క్లినికల్ ట్రయల్స్ కలకలం రేపింది. అనుమతి లేని హెపటైటిస్‌బీ వ్యాక్సిన్‌ను విక్రయించడం, జిల్లా ప్రభుత్వ వైద్యులు అనుమానాలు వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తున్నది. వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి మంగళవారం జిల్లాకేంద్రంలోని కట్టరాంపూర్‌లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్లను ఇస్తుండగా, అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన వన్‌టౌన్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సోదాలు చేయగా, వ్యాక్సిన్ బాటిళ్లతోపాటు మదర్ థెరిస్సా ఫౌండేషన్ పేరిట రసీదు బుక్కులు లభ్యమయ్యాయి. స్టేషన్‌కు తరలించి విచారించగా, ఆ వ్యక్తి వరంగల్‌కు చెందిన రమేశ్‌రెడ్డిగా గుర్తించారు. డిగ్రీ చదివిన రమేశ్‌రెడ్డికి ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేదనీ, వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు గుర్తించి డీఎంహెచ్‌ఓకు సమాచారం అందించారు. పోలీసుల సమాచారంతో స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్లను స్టేషన్‌కు పంపించి పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. వ్యాక్సిన్ బాటిళ్లను పరిశీలించిన వైద్యులు అనుమతి లేనివిగా, పూణేకు చెందిన ఓ కంపెనీవిగా గుర్తించారు. సర్కారు మూడు విధాలుగా అనుమతి వస్తుందనీ, కానీ, ఈ వ్యాక్సిన్లకు ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పారు. అనఫీషియల్‌గా ట్రయల్స్ కావొచ్చని అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles