అన్ని విధాలా ఆదుకుంటాం

Tue,August 13, 2019 02:58 AM

చిగురుమామిడి: రామంచ మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ నాయకుడు సాద చంద్రారెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన భౌతిక కాయాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రారెడ్డి సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారనీ, టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలందిస్తూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఆయన వెంట చిగురుమామిడి, సైదాపూర్ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, సోమారపు రాజయ్య, మాజీ జడ్పీటీసీలు వీరమల్ల శేఖర్, బిల్ల వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆకవరం భవాని, టీఆర్‌ఎస్ నాయకులు ముప్పిడి దేవేందర్‌రెడ్డి, దాసరి సాంబయ్య, సిద్దెంకి రాజమల్లు, నర్ర జగదీశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పేర్యాల తిరుపతిరావు, తదితరులున్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles