చివరి మడికీ సాగునీరందిస్తాం

Tue,August 13, 2019 02:57 AM


రామడుగు: చొప్పదండి నియోజకవర్గంలోని ఆఖరు మడి వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముం దుకెళ్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని గుండి గోపాల్‌రావుపేట రైతులు, ప్ర జల విజ్ఞప్తి మేరకు ఎల్లంపల్లి గేట్ వాల్వ్ వద్ద పూజలు చేసి ఆదివారం గుండి చెరువులోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ని యోజకవర్గంలో రెండో అతిపెద్ద చెరువు అయిన గుండి చెరువు విస్తీర్ణం 120 ఎకరాలు ఉంటుందన్నారు. ఈ చెరువు నిండితే ప్రత్యక్షంగా వెయ్యి ఎకరాలకు పరోక్షంగా మరో వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గత పాలకుల హయాంలో గుండి చెరువు నిండిన చరిత్ర లేదని, చెరువును చూస్తే ఎడారిని తలపించేదని గుర్తు చేశారు. వేసిన పంటలకు సాగు నీరు అందక రైతులు ఇబ్బంది పడ్డారన్నారు.

స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో మూడుసార్లు గుండి చెరువును నింపి పం టలకు నీరందించామని గుర్తు చేశారు. అటు కాళేశ్వ రం ఇటు ఎల్లంపల్లితో చొప్పదండి నియోజకవర్గం మ రో కోనసీమగా మారబోతోందన్నారు. నీటిని విడుదల చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, చొప్పదండి ఎంపీపీ చిలుక రవి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ శ్యాంసుందర్, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ ఉన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles