భక్తి శ్రద్ధలతో బక్రీద్

Tue,August 13, 2019 02:57 AM

కరీంనగర్ రూరల్ : బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సోమవారం ఉదయం కొత్త బట్టలు ధరించి, ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకున్నారు. సామూహికంగా ప్రార్థనలు చేసి, అనంతరం అలయ్‌బలయ్ తీసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రేకుర్తి శివారులోని సాలెహ్‌నగర్ ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేశారు. సదర్‌ఖాజీ మన్ ఖాబత్‌షాఖాన్ నమాజ్ చేయించారు. అనంతరం ముఫ్తిగయాసొద్దీన్ ప్రసంగం చేశారు. పేద వారికి సహాయ చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందని చెప్పారు. ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, మాజీ కార్పొరేటర్ ఆరిఫ్, టీడీపీ నగర సమన్వయ కర్త కల్యాడపు ఆగయ్య పాల్గొని, బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

బైపాస్ రోడ్‌లోని ఈద్గాహ్ అహ్మద్ జమీయత్ ఐలే హదీజ్ షహారీ సంస్థ ఆధ్వర్యంలో హఫీజ్ మహ్మద్ యూనుస్‌మద్‌ని నమాజ్ చేయించగా, మౌలానా మహ్మద్ యూసుఫ్ మొహమ్మదీ సందేశమిచ్చారు. పండుగ సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగానే ఇరువైపులా పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తెచ్చారు. రేకుర్తి రోడ్‌పై ట్రాఫిక్‌జామ్ కాకుండా జగిత్యాల నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలను శాతవాహన యూనివర్సిటీ మల్కాపూర్ రోడ్డు మీదుగా దారి మళ్లించారు. పురపాలక సంఘం అధ్వర్యంలో నీటి వసతి, లైటింగ్, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, మాజీ ఎంపీ
హుజూరాబాద్ టౌన్: పవిత్ర పర్వదినం బక్రీద్ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు బోయినపెల్లి వినోద్‌కుమార్ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బిజిగిరిషరీష్ ఉర్సు ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొనాలన్నారు. సాయంత్రం ముస్లిం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్‌హుస్సేన్, బీఎస్‌ఎన్‌ఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ మక్బూల్‌హుస్సేన్‌కు మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ప్రత్యేకంగా ఫోన్ చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles