వృత్తి నైపుణ్య శిక్షణతో ఉజ్వల భవిష్యత్

Tue,August 13, 2019 02:56 AM

మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ : వృత్తి నైపుణ్య శిక్షణతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేట శివారులోని అర్బన్ హౌసింగ్ కాలనీ సమీపంలో ని చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ ఆశ్రమ భవనంలో జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, ప్రతిమ ఫౌండేషన్, టా టా ైస్ట్రెవ్ సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన నైపు ణ్య శిక్షణ కేంద్రాన్ని సోమవారం గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మన దేశం లో యువత ఎక్కువ సంఖ్యలో ఉందనీ, నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 1.4 మిలియన్లకు స్కిల్ డెవలప్‌మెంట్ కల్పించేందుకు సీఎస్‌ఆర్ (కంపెనీల సామాజిక బాధ్యత) విధానాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కంపెనీలో వచ్చే లాభాల్లో 2 శాతం స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నా రు. జర్మనీ, ఇజ్రాయిల్, చైనా దేశాలు కేవలం స్కిల్ డెవలప్‌మెంట్ ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మెరుగైన ఫలితాలతో అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయన్నారు.

జర్మనీలో విద్య తక్కువగా ఉన్నా అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువ అని అన్నారు. ఇజ్రాయిల్‌లో కొత్త విషయాలను కనుగొనడంలో ప్రపంచ దేశాల్లో రెండో స్థానంలో ఉందనీ, ఆదేశం స్టార్టప్‌లో ముందంజలో ఉందని పేర్కొన్నారు. చదువు అంటే కేవలం బీఏ, బీకాం, బీఎస్సీ యేకాదనీ, సమాంతరంగా సాంకేతిక, సాంకేతికేతర వృత్తి విద్యా కోర్సులను చేయడం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగా లు, అదేవిధంగా దేశ, విదేశాల్లో చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను లభిస్తాయన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ వల్ల దేశం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు జీయర్ ట్రస్ట్, మై హోం సంస్థ అధినేత రామేశ్వర్‌రావు, ప్రతిమ పౌండేషన్ చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు ముందుకు వచ్చారనీ, వీరి భాగస్వామ్యంతో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ వారి టాటా ైస్ట్రెవ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే రాయికల్, నాగారంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయనీ, ఇల్లంతకుంటలోనూ త్వరలోనే నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles