ఒకే నేషన్.. ఒకే పెన్షన్ విధానాన్ని తేవాలి

Sun,August 11, 2019 02:34 AM

రామడుగు: కేంద్ర ప్రభుత్వం ఒకే నేషన్.. ఒకే రేషన్ తీసుకురావడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదనీ, ఒకే నేషన్.. ఒకే పెన్షన్ విధానాన్ని తీసుకురావడం ద్వారా జాతీయస్థాయిలో అధికశాతం ఉన్న వయోవృద్ధులకు లబ్ధికలిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మాదం రమేశ్ మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్ల అమలులో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ర్టాన్ని చూసైనా కేంద్రం మారాలన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 500లకు మించి పింఛన్ ఇవ్వడం లేదన్నారు. గతంలో రాష్ట్రం ఇచ్చే రూ.వెయ్యి పింఛన్‌లో 800 తామే ఇస్తున్నామన్న బీజేపీ నాయకులు ప్రస్తుతం రూ.రెండువేల పదహార్లకు తామే 1600 ఇస్తున్నట్లు చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు ఒకే నేషన్ ఒకే పెన్షన్ విధానాన్ని తీసుకురావటానికి పోరాడాలన్నారు. మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ సలావుద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్, పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మామిడి నర్సయ్య, రైతు సమన్వయ సమితీ సభ్యుడు రాగం లచ్చయ్య పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles