కామన్ పీజీ ప్రవేశ పరీక్షలో అల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ

Sun,August 11, 2019 02:33 AM

కరీంనగర్ ఎడ్యుకేషన్: కామన్ పీజీ ప్రవేశ పరీక్షలో అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని కళాశాలల కరస్పాండెంట్ వీ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెస్సీ సాంఖ్యాక శాస్త్ర విభాగంలో ఎస్ దివ్య 65వ ర్యాంకు, వీ మౌనిక 90వ ర్యాంకు, ఏ సంధ్యారాణి 171, ఎల్ సౌమ్య 240, ఏ మౌనిక 251, జీ అఖిల 261, ఎన్ రవళి 273వ ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశపరీక్షలు ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రస్థాయిలో ఉమ్మడిగా నిర్వహిస్తుండగా, విద్యార్థులు ఉత్తమ ప్రతిభతో సత్తా చాటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles