డీవైఎస్‌వో అశోక్‌కుమార్‌ను అభినందించిన కరీంనగర్ ఎంపీ

Sun,August 11, 2019 02:33 AM

కరీంనగర్ స్పోర్ట్స్: అంతర్జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటున్న భారత జట్టుకు కోచ్‌గా ఎంపికకావడంతో పాటు రెండు పతకాలు సాధించేలా శిక్షణలు ఇచ్చిన కరీంనగర్ జిల్లా యువజన, క్రీడాశాఖాధికారి (డీవైఎస్‌వో) జీ అశోక్‌కుమార్‌ను ఎంపీ బండి సంజయ్‌కుమార్ శనివారం ఆయన నివాసంలో అభినందించారు. అలాగే పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అశోక్‌కుమార్ కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో రెజ్లింగ్ కోచ్‌గా పనిచేసినప్పటి నుంచి అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయనీ, పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగడం ఇందుకు నిదర్శమన్నారు.

ప్రపంచ పోటీల్లో పాల్గొన్న భారత జట్టు క్రీడాకారులు సాధించిన పతకాలతో ప్రపంచంలోని దేశాలకు చెందిన జెండాల ముందు భారతదేశ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాండించడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో కరీంనగర్ నుంచి అంతర్జాతీయ రెజ్లర్లను తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రమేశ్‌రెడ్డి, మహ్మద్ కరీం, జిల్లా యోగా సంఘం కార్యదర్శి ఎన్ సిద్దారెడ్డి, ఇండియన్ ైస్టెల్ రెజ్లింగ్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీర రాములు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles