మక్కజొన్నలో సస్యరక్షణ పద్ధతులు పాటించాలి

Sun,August 11, 2019 02:33 AM

ఇల్లందకుంట: మక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు సస్యరక్షణ పద్ధతులను పాటించాలని వ్యవసాయాధికారి గుర్రం రజిత రైతులకు సూచించారు. శనివారం మండలంలోని ఇల్లందకుంట గ్రామంలో రైతులు సాగు చేసిన మక్కజొన్న పంటలో కత్తెర పురుగు ఉధృతిపై పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ... లేత మక్కజొన్నలో (30 రోజుల లోపు) ఎకరానికి 8-10 లింగాకర్షక బుట్టలను పైరుకు ఒక అడుగుపై వరకు ఉండేలా అమర్చుకోవాలని సూచించారు. ఇసుకను మక్కజొన్న సుడులలో వేయడం ద్వారా రాపిడికి పురుగులు చనిపోతాయని తెలిపారు.

పురుగు నివారణకు నొమేరియా రిలే, మెటరైజియం అనిసోప్లియె అనే మందు పొడి రూపంలో మార్కెట్‌లో దొరుకుతుందనీ, ఈ మందును లీటరు నీటిలో 5 గ్రాముల చొప్పున సాయంత్రం పూట పంటపై పిచికారి చేయడం ద్వారా శిలీంధ్రాలు సోకిన పంటను రక్షించుకోవచ్చునన్నారు. పురుగు ఆశించిన 30 రోజుల్లో వేప నూనె (అజాడిరక్టిన్) 5 మిల్లీ లీటర్లు, బి.టి ఫార్ములేషన్ 2 గ్రాములు, క్లోరోఫైరిఫాస్ 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. 31-65 రోజుల్లో క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మిల్లీ లీటర్లు, ఇండాక్సికార్బ్ 1 మిల్లీ లీటర్లు, లామ్డాసైహలోథ్రిన్ 0.5 మిల్లీ లీటర్లు, లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. 65 రోజుల పంటలో పురుగు మందులు పని చేయవనీ, ఎదిగిన పురుగులను కూలీలతో ఏరించి కిరోసిన్ డబ్బాలో వేసి చంపి వేయాలని సూచించారు. ఆమె వెంట ఏఈవోలు సంపత్, రాకేశ్, మహేందర్, రైతులు ఉన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles