గురుకులంలో వైద్య శిబిరం హుజూరాబాద్ రూరల్: మండలంలోని బోర్నపల్లి గ్రామంలో�

Sun,August 11, 2019 02:32 AM

హుజూరాబాద్ రూరల్: మండలంలోని బోర్నపల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయంలో శనివారం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో భాగంగా విద్యార్థులకు టీటీ ఇంజక్షన్‌లు వేశారు. విద్యార్థులకు గాయాలైనప్పుడు, ఇన్‌ఫెక్షన్లు సోకినప్పుడు ధనుర్వాతం రాకుండా ఈ సూది మందు కాపాడుతుందని ఆరోగ్య పర్యవేక్షకుడు ఎస్ రమేశ్ పేర్కొన్నారు. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అనంతరం పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏఎన్‌ఎంలు రాణి, వనిత, సదానందం, రమాదేవి, అరుణతో పాటు ఉపాధ్యాయులు తదితరులున్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles