పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Sun,August 11, 2019 02:31 AM

సైదాపూర్: తపాలా బీమా పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సైదాపూర్ పోస్ట్‌మాస్టర్ మహేందర్ సూచించారు. శనివారం మండలకేంద్రంలోని వెన్కేపల్లి-సైదాపూర్ గ్రామాల్లో తపాలా బీమా పథకాలపై ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి కేవలం 12 రూపాయలు చెల్లించి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో చేరడం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా ఉంటుందనీ, 330 రూపాయలతో ప్రధానమంత్రి జీవనజ్యోతితో 2లక్షల బీమా చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అటల్ పెన్షన్ యోజన గురించి వివరించారు. అనంతరం నైపుణ్య భారత్- డిజిటల్ భారత్‌లో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంటు బ్యాంకు ఖాతాలను వెన్కేపల్లి సర్పంచ్ కొండ గణేశ్, పశువైద్యాధికారి విజేందర్‌రావుతో పాటు వంద మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్త మధుసూదన్‌రెడ్డి, వార్డు సభ్యులు, తపాలాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles