చదువుతోపాటు సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి

Sat,August 10, 2019 02:42 AM

కరీంనగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ ప్రథమ వీసీ ఆచార్య ఇక్బాల్ అలీ సూచించారు. శుక్రవారం స్థానిక రాంనగర్‌లోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పసిడి పతకాలు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు.

దీనికి పూర్వ వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యా బుద్ధులు నేర్పిన గురువులను, కనీ పెంచిన తల్లిదండ్రులను ఎప్పుడూ మరవకూడదన్నారు. పతకాలను సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ చైతన్య కళాశాల కరస్పాండెంట్ ముద్దసాని రమేశ్ రెడ్డి మాట్లాడుతూ అత్యధికంగా తమ కళాశాల నుంచి విద్యార్థులు వివిధ విభాగాల్లో పతకాలను సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. ఇక నుంచి తన తండ్రి దివంగత ముద్దసాని లకా్ష్మరెడ్డి పేరున ప్రతి సంవత్సరం బంగారు పతకాలను అందించనున్నట్లు వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపాల్ శర్మ మాట్లాడుతూ తమ విద్యార్థులు అత్యధికంగా వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం విభాగాల్లో పసిడి పతకాలు అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పతకాలను సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ నరేందర్‌రెడ్డి, బుర్ర మధుసూదన్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles