వెలికితీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు

Sat,August 10, 2019 02:41 AM

కరీంనగర్ రూరల్: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి సీఐ సాధన్‌కుమార్ తెలిపారు. కరీంనగర్ మండలం మొగ్దుంపూర్‌లోని రేయిన్‌బో పాఠశాలలో శుక్రవారం ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాలను విద్యార్థులకు వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు తయారు చేసిన పలు ప్రయోగాలను పరిశీలించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కం నర్సయ్య, ఫిట్ ఇండియా ఫౌండేషన్ మండల అధ్యక్షుడు తాండ్ర సుమన్, గ్రామ శాఖ అధ్యక్షుడు నరేశ్, పాఠశాల కరస్పాండెంట్ ఎండీ షబ్బీర్, ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles