ఎంవీఐపై ఫిర్యాదు

Sat,August 10, 2019 02:41 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎంవీఐ గౌస్‌పాషాపై చర్యలు తీసుకోవాలని మండలంలోని మొగిలిపాలెం గ్రామానికి చెందిన పాశం అశోక్‌రెడ్డి శుక్రవారం రవాణాశాఖ కార్యాలయ ఏఓ మస్లియొద్దీన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన కోల నరేశ్‌కు చెందిన ఆటో ట్రాలీని కొను గోలు చేశానని, తన పేరు మీదికి మార్పిడి చేసుకోలేదని తెలిపాడు. కాగా శుక్రవారం వాహనాల తనిఖీల్లో భాగంగా ఎంవీఐ గౌస్‌పాషా రవాణాశాఖ కార్యాలయం ఎదుట తన ఆటోను ఆపి కాగితాలు చూపించాలన్నాడు.

ఆటో కాగితాలు తన పేరుమీద లేవని చెప్పడంతో ఎంవీఐ కేసు రాస్తానని చెప్పాడు. కేసు రాయకుండా ఉండాలంటే రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని అశోక్‌రెడ్డి ఆరోపించారు. తన వద్ద అంత డబ్బు లేదని తెలుపగా రూ. 5వేలు ఇవ్వాలని, ఎలాంటి రాజకీయ పైరవీలు చేయవద్దని, నిబంధనల ప్రకారం వెళితే రూ. 30వేల నుంచి 50వేల వరకు పెనాల్టీ వేస్తానని బెదిరంచాడని వాపోయాడు. చేసేది లేక రూ. 5వేలు ఇస్తానని చెప్పడంతో ఎంవీఐ గూగుల్ పే చేయాలని రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చాడని ఇందులో ఒక నంబర్‌కు రూ. 5వేలు పంపగానే వాహనాన్ని వదిలిపెట్టాడని తెలిపాడు. ఈ విషయా న్ని డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌కు ఫోన్‌లో వివరించగా లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో ఏవోకు ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles