గుట్కాల పట్టివేత

Sat,August 10, 2019 02:41 AM

జమ్మికుంట: మండలంలోని వావిలాలలో శుక్రవారం సాయంత్రం కరీంనగర్ టాస్క్‌ఫోర్స్, పట్టణ పోలీసులు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో రూ.5,99,250 విలువ గల గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. సీఐ సృజన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చివరి గ్రామమైన వావిలాల కేంద్రంగా గుట్కా అక్రమ రవాణా జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో సదరు ఇంటిపై నిఘా పెట్టారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శోభన్‌కుమార్, సీఐలు శ్రీనివాస్‌రావు, జనార్దన్, జమ్మికుంట సీఐ సృజన్‌రెడ్డిల ఆధ్వర్యంలో దూడం అశోక్ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.

అదే సమయంలో నిల్వ చేసిన గుట్కాలను పంపిణీకి కోసం రాజేందర్ (సిరిసేడు), వెంకటేశ్ (కొత్తగూడెం), వీరన్న(మహబూబాబాద్) ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల రాకను గమనించిన వీరన్న తప్పించుకున్నాడు. కాగా గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. గుట్కాలతో పాటు అక్రమంగా గుట్కాలను నిల్వ చేసి వ్యాపారం చేస్తున్న అశోక్, రాజేందర్, వెంకటేశ్‌ను జమ్మికుంట ఠాణాకు తరలించారు. నలుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. ఇక్కడ జమ్మికుంట ఎస్‌ఐలు సత్యనారాయణ, స్వామి, సిబ్బంది ఉన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles