పారమిత పాఠశాలలో నూతన క్రీడా ప్రాంగణం ప్రారంభం

Sat,August 10, 2019 02:41 AM

కరీంనగర్ రూరల్: పద్మనగర్‌లోని పారమిత పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని శుక్రవారం ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాద్‌రావు ప్రారంభించారు. అలాగే ఇటీవల జరిగిన హౌస్ ఎన్నికల్లో గెలిచిన విద్యార్థులకు ఆయా విభాగాల పతాకాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈ ప్రసాద్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నప్పుడే చదువులో రాణించగలరని తెలిపారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాలల డైరెక్టర్స్ ప్రసూన, రశ్మిత, అనూకర్‌రావు, వినోద్‌రావు, ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ చైతన్య, వైస్ ప్రిన్సిపాల్ బాలాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles