అట్టహసంగా స్నాతకోత్సవం

Fri,August 9, 2019 02:09 AM

-పండుగలా శాతవాహన యూనివర్సిటీ మొదటి కాన్వొకేషన్ డే
-వీ కన్వెన్షన్‌లో సంబురంగా వేడుక
-విద్యార్థులకు పతకాలు, పట్టాల పంపిణీ
-260 మందికి అందజేత
-ప్రదానం చేసిన ముఖ్య అతిథి ఎన్‌బీఏ డైరెక్టర్, ఇన్‌చార్జి వీసీ
-లక్ష్యం కోసం తపించాలని పిలుపు : కేకే అగర్వాల్
-అంచెలంచెలుగా యూనివర్సిటీ అభివృద్ధి : చిరంజీవులు

కరీంనగర్ ఎడ్యుకేషన్ : శాతవాహన యూనివర్సిటీ మొదటి -పండుగలా శాతవాహన యూనివర్సిటీ మొదటి కాన్వొకేషన్ డే
-వీ కన్వెన్షన్‌లో సంబురంగా వేడుక
-విద్యార్థులకు పతకాలు, పట్టాల పంపిణీ
-260 మందికి అందజేత
-ప్రదానం చేసిన ముఖ్య అతిథి ఎన్‌బీఏ డైరెక్టర్, ఇన్‌చార్జి వీసీ
-లక్ష్యం కోసం తపించాలని పిలుపు : కేకే అగర్వాల్
-అంచెలంచెలుగా యూనివర్సిటీ అభివృద్ధి : చిరంజీవులు

కరీంనగర్ ఎడ్యుకేషన్ : శాతవాహన యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవాన్ని గురువారం కరీంనగర్ శివారులోని వీ కన్వెన్షన్ హాల్‌లో అట్టహాసంగా జరిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఢిల్లీ డైరక్టర్ కేకే అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కన్వెన్షన్‌కు చేరుకున్న ఆయనతోపాటు ఇన్‌చార్జి వీసీ చిరంజీవులుకు యూనివర్సిటీ అధికారులు ఘనస్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న అనంతరం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉమేశ్‌కుమార్ స్వాగతోపాన్యాసం చేశారు. ఇన్‌చార్జి వీసీ యూనివర్సిటీ నివేదిక సమర్పించారు. అనంతరం కేకే అగర్వాల్, చిరంజీవులు 130 మందికి బంగారు పతకాలు, పట్టాలతోపాటు మరో 130 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో కొందరు మూడు, రెండు చొప్పున పతకాలు అందుకున్నారు. కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, రిజిస్ట్రార్ ఉమేశ్‌కుమార్, పరీక్షల నియంత్రణ అధికారి భరత్, సహాయ పరీక్షల నియంత్రణ అధికారులు డాక్టర్ కోడూరి శ్రీవాణి, మాజీ వీసీ ఇక్బాల్ అలీ, శ్రీరంగ ప్రసాద్, అబ్రార్ బాఖీ, టీఆర్‌ఎస్ నాయకులు ఆరెపల్లి మొహన్, వివిధ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరలు పాల్గొన్నారు.

మురిసిపోయిన విద్యార్థులు..
ఎస్‌యూ ప్రారంభించిన 2008 తర్వాత మొదటిసారిగా నిర్వహించిన స్నాతకోత్సవానికి 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెల్లదుస్తుల్లో ఐడీ కార్డులు ధరించి కార్యక్రమానికి ఉత్సాహంగా తరలివచ్చారు. అందుకున్న బంగారు పతకాలు, పట్టాలు కళ్లనిండా చూసుకుంటూ సంబురపడ్డారు. పట్టాలను అందుకోవడం ఓ తీపి జ్ఞాపకమనీ, ఎన్నో ఏళ్ల తమ ఎదురుచూపులకు ఫలితం దక్కిందంటూ ఆనందపడ్డారు. తల్లిదండ్రులు, మిత్రులు, కుటుంబసభ్యులకు చూపుతూ మురిసిపోయారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు.

ప్రముఖుల అభినందనలు..
పథకాలు సాధించిన విద్యార్థులను స్నాతకోత్సవానికి హాజరైన ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ఎంఏ(తెలగు) విభాగంలో ఐదు పతకాలు అందుకున్న ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన మామిడి ప్రభాకర్‌ను కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అభినందించారు. వీరితో పాటు పతకాలు సాధించిన విద్యార్థులకు యూనివర్సిటీ అధ్యాపకులు, ఆయా కళాశాలల చైర్మన్లు, డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. శ్రీచైతన్య కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు, పట్టాలు, 18 మంది పట్టాలు అందుకోగా, వీరిని కళాశాల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి, ప్రిన్సిపాల్‌శర్మ అభినందించారు. అలాగే ఎంఎస్సీ రసాయనశాస్త్రంలో అల్ఫోర్స్ మహిళా కళాశాల విద్యార్థి ప్రణీత బంగారు పతకం అందుకోగా, ఆ కళాశాల కరస్పాడెంట్ వీ రవీందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.

లక్ష్యం కోసం తపించాలి..
- నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఢిల్లీ డైరక్టర్ కేకే అగర్వాల్
విద్యార్థులు లక్ష్యం కోసం తపించాలని నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఢిల్లీ డైరక్టర్ కేకే అగర్వాల్ పిలుపునిచ్చారు. శాతవాహన యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి హాజరుకావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకుల మధ్య మంచి సంబంధాలుండాలనీ, విలువలతో కూడిన చదువుతోనే వ్యక్తిత్వం వృద్ధి చెందుతుందని సూచించారు. మానవీయ సంబంధాలు పెరిగే దిశగా చదువులు సాగాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువునేర్పిన గురువులతో వినయంగా మెదలాలని సూచించారు.

ఆనందంగా ఉంది
మాది ములుగు జిల్లా వెంకటాపురం. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గనిర్దేశంలో శాతవాహన వర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తిచేశా. 2016వ సంవత్సరానికి గాను ఐదు బంగారు పతకాలు సాధించా. ఈ రోజు కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూశా. చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తున్నా. శాతవాహన వర్సిటీ నుంచి క్రీడల్లో పాల్గొని, పతకాలు సాధించా. ఎస్‌యూతో మంచి అనుబంధముంది. -మామిడి ప్రభాకర్, గోల్డ్ మెడలిస్ట్

పట్టా కల నెరవేరింది
మాది పెద్దపల్లి. శాతవాహన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పట్టా, బంగారు పతకం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. క్రమశిక్షణతో కష్టపడి ఎంబీఏ చదివా. 2016వ సంవత్సరానికి నాకు బంగారు పతకం వచ్చింది. మా కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువులో రాణించి మంచి మార్కులను సాధించా. నా కష్టానికి తగ్గ ఫలితం లభించింది. పట్టా అందుకోవడం జీవితంలో మరిచిపోలేని రోజు.
-నవిత, గోల్డ్ మెడలిస్ట్న్ని గురువారం కరీంనగర్ శివారులోని వీ కన్వెన్షన్ హాల్‌లో అట్టహాసంగా జరిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఢిల్లీ డైరక్టర్ కేకే అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కన్వెన్షన్‌కు చేరుకున్న ఆయనతోపాటు ఇన్‌చార్జి వీసీ చిరంజీవులుకు యూనివర్సిటీ అధికారులు ఘనస్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న అనంతరం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉమేశ్‌కుమార్ స్వాగతోపాన్యాసం చేశారు. ఇన్‌చార్జి వీసీ యూనివర్సిటీ నివేదిక సమర్పించారు. అనంతరం కేకే అగర్వాల్, చిరంజీవులు 130 మందికి బంగారు పతకాలు, పట్టాలతోపాటు మరో 130 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో కొందరు మూడు, రెండు చొప్పున పతకాలు అందుకున్నారు. కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, రిజిస్ట్రార్ ఉమేశ్‌కుమార్, పరీక్షల నియంత్రణ అధికారి భరత్, సహాయ పరీక్షల నియంత్రణ అధికారులు డాక్టర్ కోడూరి శ్రీవాణి, మాజీ వీసీ ఇక్బాల్ అలీ, శ్రీరంగ ప్రసాద్, అబ్రార్ బాఖీ, టీఆర్‌ఎస్ నాయకులు ఆరెపల్లి మొహన్, వివిధ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరలు పాల్గొన్నారు.

మురిసిపోయిన విద్యార్థులు..
ఎస్‌యూ ప్రారంభించిన 2008 తర్వాత మొదటిసారిగా నిర్వహించిన స్నాతకోత్సవానికి 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెల్లదుస్తుల్లో ఐడీ కార్డులు ధరించి కార్యక్రమానికి ఉత్సాహంగా తరలివచ్చారు. అందుకున్న బంగారు పతకాలు, పట్టాలు కళ్లనిండా చూసుకుంటూ సంబురపడ్డారు. పట్టాలను అందుకోవడం ఓ తీపి జ్ఞాపకమనీ, ఎన్నో ఏళ్ల తమ ఎదురుచూపులకు ఫలితం దక్కిందంటూ ఆనందపడ్డారు. తల్లిదండ్రులు, మిత్రులు, కుటుంబసభ్యులకు చూపుతూ మురిసిపోయారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు.

ప్రముఖుల అభినందనలు..
పథకాలు సాధించిన విద్యార్థులను స్నాతకోత్సవానికి హాజరైన ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ఎంఏ(తెలగు) విభాగంలో ఐదు పతకాలు అందుకున్న ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన మామిడి ప్రభాకర్‌ను కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అభినందించారు. వీరితో పాటు పతకాలు సాధించిన విద్యార్థులకు యూనివర్సిటీ అధ్యాపకులు, ఆయా కళాశాలల చైర్మన్లు, డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. శ్రీచైతన్య కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు, పట్టాలు, 18 మంది పట్టాలు అందుకోగా, వీరిని కళాశాల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి, ప్రిన్సిపాల్‌శర్మ అభినందించారు. అలాగే ఎంఎస్సీ రసాయనశాస్త్రంలో అల్ఫోర్స్ మహిళా కళాశాల విద్యార్థి ప్రణీత బంగారు పతకం అందుకోగా, ఆ కళాశాల కరస్పాడెంట్ వీ రవీందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.

లక్ష్యం కోసం తపించాలి..
- నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఢిల్లీ డైరక్టర్ కేకే అగర్వాల్
విద్యార్థులు లక్ష్యం కోసం తపించాలని నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఢిల్లీ డైరక్టర్ కేకే అగర్వాల్ పిలుపునిచ్చారు. శాతవాహన యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి హాజరుకావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకుల మధ్య మంచి సంబంధాలుండాలనీ, విలువలతో కూడిన చదువుతోనే వ్యక్తిత్వం వృద్ధి చెందుతుందని సూచించారు. మానవీయ సంబంధాలు పెరిగే దిశగా చదువులు సాగాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువునేర్పిన గురువులతో వినయంగా మెదలాలని సూచించారు.

ఆనందంగా ఉంది
మాది ములుగు జిల్లా వెంకటాపురం. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గనిర్దేశంలో శాతవాహన వర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తిచేశా. 2016వ సంవత్సరానికి గాను ఐదు బంగారు పతకాలు సాధించా. ఈ రోజు కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూశా. చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తున్నా. శాతవాహన వర్సిటీ నుంచి క్రీడల్లో పాల్గొని, పతకాలు సాధించా. ఎస్‌యూతో మంచి అనుబంధముంది. -మామిడి ప్రభాకర్, గోల్డ్ మెడలిస్ట్

పట్టా కల నెరవేరింది
మాది పెద్దపల్లి. శాతవాహన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పట్టా, బంగారు పతకం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. క్రమశిక్షణతో కష్టపడి ఎంబీఏ చదివా. 2016వ సంవత్సరానికి నాకు బంగారు పతకం వచ్చింది. మా కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువులో రాణించి మంచి మార్కులను సాధించా. నా కష్టానికి తగ్గ ఫలితం లభించింది. పట్టా అందుకోవడం జీవితంలో మరిచిపోలేని రోజు.
-నవిత, గోల్డ్ మెడలిస్ట్

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles